Breaking News

సంజూ సీక్రెట్‌.. ఆమెతో లవ్‌స్టోరీ! చారులత గురించి తెలుసా?

Published on Mon, 03/02/2026 - 14:12

ఆదివారం వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్‌ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.

సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్‌చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్‌ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్‌ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. 

మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్‌ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్‌ ఇవానియోస్‌ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. 

అయితే చారులత తన కెరీర్‌పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టి కెరీర్‌లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్‌ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్‌ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 

(చదవండి: జస్ట్‌ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్‌..! నో జిమ్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)