Breaking News

సెషెల్స్ ద్వితీయ మహిళకు ‍ప్రధాని మోదీ గిఫ్ట్‌గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే

Published on Wed, 07/01/2026 - 11:10

ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్‌ పాట్రిక్‌ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్‌ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్‌ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.

కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి. 

ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ లేదా ఫుల్‌స్లీవ్‌ సిల్హౌట్‌లు ఈ చీర లుక్‌ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్‌వేరల్‌లోకి తీసుకొస్తుండటం విశేషం. 

అంతేగాదు వెస్ట్‌కోట్‌లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్‌లు లేదా న్యూట్రల్ బేసిక్స్‌తో  జత చేసి సరికొత్త ట్రెండ​్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్‌ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్‌ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే. 

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్‌ తర్వాత బరువు తగ్గాలంటే..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)