Breaking News

భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్‌

Published on Thu, 12/26/2024 - 12:14

కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది.  భార్యభర్తల ప్రేమ  అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ  ఘటన జరిగింది.

జైపూర్‌కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పని చేసేవారు..  అతని భార్య  టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి  రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో  మూడేళ్ల పదవీకాలం ఉండగానే   ముందస్తు రిటైర్‌మెంట్‌ ( వీఆర్ఎస్) తీసుకున్నారు.  ఈ  సందర్బంగా  దేవంద్ర సహోద్యోగులు  వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.

కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య  వీపుపై  రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే  పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే  ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.

భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ  హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో  టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)