Breaking News

98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్‌ అయిన డైట్‌ప్లాన్‌..

Published on Sun, 07/26/2026 - 10:23

అధిక బరువు కొందరికీ జంక్‌ఫుడ్‌, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్‌ జాబ్‌లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్‌ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్‌డౌన్‌ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్‌తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. 

ఆ మహిళే..ఆనంద్‌ భార్గవ్‌. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్‌ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్‌కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్‌లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. 

రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు.  దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్‌ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్‌ ప్లాన్‌ని కూడా పంచుకుంది. 

ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్

అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్

ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లు

మధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్‌తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగు

సాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రా

రాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్


ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.

ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్‌లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన,  చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుందామె.

(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)