Breaking News

మరీ ఏడు నెలల గర్భంతోనా.. రిస్క్‌ కాదా?

Published on Tue, 09/29/2026 - 13:29

ఏడు నెలల గర్భం.. కడుపులో బిడ్డ.. అయినా పరుగులు, వెయిట్స్‌, బర్పీస్‌, స్లెడ్‌ పుష్‌.. చివరకు హైరోక్స్‌ రేస్‌ను పూర్తి చేసింది ఓ భారతీయ మహిళ. దీంతో ఆమె వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు గర్భంతో ఇంత కఠినమైన వ్యాయామం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? గర్భంతోనే ఈ రేస్‌ను ఎలా పూర్తి చేసింది?

ఆమె పేరు జెన్నిఫర్‌.. ముద్దుగా జెన్నీ. వయసు 37 ఏళ్లు. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం చైనాలోని షాంఘైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఫిట్‌నెస్‌ రంగంలో కొనసాగుతున్న జెన్నీ.. షాంఘైలోని HYROXworldలో పనిచేస్తున్నారు. అంతేకాదు Rises Shanghai అనే ఫిట్‌నెస్‌ సెంటర్‌కు ఫౌండర్‌, కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు HYROX రేసుల్లో పాల్గొన్నారు.

హైరోక్స్‌ అంటే.. రన్నింగ్‌ రేస్‌ కాదు.. జిమ్‌ వర్కౌట్‌ కూడా కాదు. రెండింటినీ కలిపిన ఇండోర్‌ ఫిట్‌నెస్‌ పోటీ. ఇందులో పోటీదారులు 1 కి.మీ. పరుగెత్తి.. వెంటనే ఒక ఫిట్‌నెస్‌ వ్యాయామం చేయాలి. ఇలా రన్‌, వర్కౌట్‌ చొప్పున మొత్తం 8 రౌండ్లు పూర్తి చేయాలి. అంటే మొత్తం 8 కి.మీ. రన్నింగ్‌తో పాటు 8 రకాల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లు ఉంటాయి.

వాటిలో స్లెడ్‌ను తోసడం, స్లెడ్‌ను లాగడం, రోయింగ్‌, స్కీ ఎర్గ్‌, బర్పీ బ్రాడ్‌ జంప్స్‌, బరువులు మోసుకుంటూ నడవడం, శాండ్‌బ్యాగ్‌తో లంజెస్‌, వాల్‌ బాల్స్‌ వంటి కఠినమైన వ్యాయామాలు ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే: “పరుగెత్తాలి.. వెంటనే బరువులతో వ్యాయామం చేయాలి.. మళ్లీ పరుగెత్తాలి.. మళ్లీ వర్కౌట్‌ చేయాలి” .

గర్భంతో రెండోసారి రేస్‌..
గర్భం దాల్చిన తర్వాత కూడా ఫిట్‌నెస్‌ను కొనసాగించాలని జెన్నీ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో గర్భం దాల్చిన ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో తన శిక్షణను కొనసాగించారు. గర్భం ఐదో నెలలో జపాన్‌లో జరిగిన HYROX రేసులో పాల్గొన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ రేసులో ఏడో నెల గర్భంతో బరిలోకి దిగి ఫినిషింగ్‌ లైన్‌ చేరుకున్నారు.

ఎలా శిక్షణ తీసుకున్నారు?
గర్భం తర్వాత తన వ్యాయామ తీవ్రతను తగ్గించినట్లు జెన్నీ తెలిపారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తక్కువ నుంచి మోస్తరు తీవ్రతతో రన్నింగ్‌ చేసేవారు. మరో మూడు, నాలుగు శిక్షణ సెషన్లలో కనీసం రెండు సార్లు స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ చేసేవారు. అయితే గర్భం తర్వాత స్ప్రింట్లు, ఇంటర్వెల్‌ రన్నింగ్‌ను పూర్తిగా ఆపేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లోనూ తన గరిష్ఠ సామర్థ్యంలో 70 శాతానికి మించకుండా చూసుకున్నారు. బర్పీస్‌ను కూడా మోకాళ్లు నేలపై ఉంచి చేసేలా మార్చుకున్నారు.

డాక్టర్‌ పర్యవేక్షణలోనే..
ఇక్కడ జెన్నీ గైనకాలజిస్ట్‌ కూడా ఆమె శిక్షణ గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలిపారు. రక్త పరీక్షలు, స్కాన్లు దాదాపు ప్రతి వారం చేయించుకున్నానని, తన ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో వైద్యురాలు వ్యాయామాన్ని ఆపాలని చెప్పలేదని జెన్నీ వెల్లడించారు. అయితే ప్రతి గర్భధారణ ఒకేలా ఉండదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో జెన్నీ రేసు  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

గర్భంతో ఇంత తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల బిడ్డకు ప్రమాదం కలగొచ్చని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తాను తన శరీరాన్ని గమనించుకుంటూ, వైద్యుల సలహాతోనే శిక్షణ కొనసాగించానని జెన్నీ పేర్కొంది. అలాగే తల్లి కాబోయే ముందు తన భాగస్వామితో కలిసి ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలన్నదే లక్ష్యమని అందుకోసమే ఈ సాహాసానికి పూనుకున్నట్లు వెల్లడించింది. 

 

ఇదీ చదవండి: చివరి ట్రైమెస్టర్‌ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా..)

 

 

 

 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు