కూతురి వెర్రి పని... సూపర్‌ డాడీ సాహసం, వైరల్‌ వీడియో

Published on Tue, 06/17/2025 - 17:41

రైల్వేస్టేషన్‌లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు   ఎక్కేందుకు ప్రయత్నించవద్దని,  రైలు వస్తున్నపుడు  ప్లాట్‌ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్‌ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్‌ వీడియోను చూడాల్సిందే.  ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.

రైల్వే స్టేషన్‌ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో  చాలా  లైట్‌ తీసుకుంటారు. అలా రైలు  పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు  ప్రయత్నించింది. ఏ  మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే  అటువైపు వేగంగా  రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది.  దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు  కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు.  ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా  ముందుకు వెళ్లిపోయింది.  అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.  దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే.  దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌  వైరల్‌గా మారింది.  లక్షల మంది షేర్‌ చేశారు. దాదాపు  కోటి (9.7 మిలియన్లు) వ్యూస్‌ దక్కించుకుంది.

కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను  చూసి సూపర్‌ డాడ్‌ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్‌ అవుతున్నారు.  తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు  వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్‌  చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు

అసలు విషయం ఏమిటంటే..
అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన  ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని  ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)