Breaking News

ఆన్‌లైన్‌లో పాడిగేదెలు : లక్షల్లో మోసపోయిన డైరెక్టర్‌

Published on Thu, 08/21/2025 - 17:35

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్‌ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...

శాండల్‌వుడ్ దర్శకుడు ప్రేమ్‌ గుజరాత్‌కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు.  బ్రహ్మాండమైన రెండు  గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని  పత్తా లేకుండా పోయాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని  చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని  కొనేందుకు  ఆన్‌లైన్‌ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన వాఘేలా వనరాజ్‌భాయ్ శాంతిభాయ్‌ను  సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్‌ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా  నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్‌ మరో  విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్‌ఫర్‌  చేశాడు. కానీ గేదెల డెలివరీ  మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్‌  ఎత్తడం మానేశాడు.  దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

నిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు. 

గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్‌ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు. 

ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్‌ 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)