Breaking News

AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్‌

Published on Sat, 06/14/2025 - 11:36

అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ  దృశ్యాలు ఆన్‌లైన్‌లో  వైరల్‌గా మారాయి 

ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్‌  వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు  ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు  ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. 

ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
 

> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో  బీజే మెడికల్‌ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే.

 

 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)