Breaking News

Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

Published on Thu, 06/12/2025 - 16:06

Ahmedabad Plane Crash గుజరాత్‌లోని  అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171  కుప్పకూలిపోయింది.   గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు.  వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు.  ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇంధన సామర్థ్యం, ​​అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53  బ్రిటిష్‌ పౌరులు,ఒకకెనడియన్‌, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది  ప్రాణాలున్నారు అనేది సందేహమే.

మేడే కాల్‌ 
విమానంనుంచి ‘ మేడే  (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు"  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా  స్థానిక అధికారులతో కలిసి  చేస్తోంది. ఈ మేరకు ఒక  ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.

ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్‌అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు  ఆలస్యంతో  బయలుదేరి  టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్‌లు  NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌)


బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్

బిజినెస్‌ స్టాండర్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్  అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది.  తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు,  లార్డర్‌ డిమ్మబుల్‌ విండోస్‌, నిశ్శబ్ద క్యాబిన్‌ లాంటి ఫీచర్స్‌ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం  ఉంటుంది.   13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.

2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్‌లైనర్‌లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ 787, మరొకటి జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్‌కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్‌లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.

ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్‌ నగలతో, గార్జియస్‌గా అఖిల్‌ అర్థాంగి

2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్‌బ్లోయర్ సామ్ సలేహ్‌పూర్ డ్రీమ్‌లైనర్ ఫ్యూజ్‌లేజ్‌లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్‌కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.

- మార్చి 2024లో, LATAM ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్‌పిట్‌లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు  గత కొన్నేళ్లుగా డ్రీమ్‌లైనర్‌ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం  మునుపెన్నడూ జరగలేదు.

ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. 
అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో  AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)