Breaking News

పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?

Published on Thu, 10/16/2025 - 10:33

శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ  ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్‌లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.

రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయం
తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.

కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయం
కోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.

నెల్లువాయ భగవాన్‌ ధన్వంతరి ఆలయం
గురువాయూర్, త్రిసూర్‌ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్‌ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.

మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయం
మలప్పురంలోని పులమంథోల్‌ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్‌ మూస్‌ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.

శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవు
కేరళలోని త్రిస్సూర్‌ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్‌. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్‌ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.

వడక్కంచెరి ధన్వంతరి ఆలయం
వడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్‌కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. 
(అక్టోబర్‌ 18, శనివారం ధన్వంతరి జయంతి) 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)