Breaking News

మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?

Published on Sun, 06/22/2025 - 15:10

సాక్షి,కర్నూల్‌: మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్‌ మర్డర్‌ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

11 రోజులకే హనీమూన్‌ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్‌ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్‌ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్‌ నగర్‌ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్‌ లైసెన్స్‌ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్‌ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తేజేశ్వర్‌ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్‌ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

మే 18న బీచ్‌పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్‌ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్‌ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)