Breaking News

టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు

Published on Thu, 07/06/2023 - 11:29

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేతల జీఎస్టీ స్కాంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2600 బోగస్ కంపెనీలను జీఎస్టీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.. ఢిల్లీ కేంద్రంగా 10వేల కోట్లకు పైగా స్కాం జరిగినట్లు బట్టబయలైంది. హైదరాబాద్‌లో 326పైగా బోగస్ కంపెనీలను అధికారులు గుర్తించారు.

రాత్రికి రాత్రికి బోగస్ గోదాంలు సృష్టిస్తున్న జీఎస్టీ ఫేక్ బిల్లింగ్ మాఫియా.. ఇతరుల ఆధార్, పాన్ కార్డ్ లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లు పొందుతున్నారు. ఎలాంటి స్టాక్ లేకుండా 4 నుండి 6 శాతానికి బోగస్ కంపెనీల నుంచి వ్యాపారవేత్తలు బిల్స్ కొంటున్నారు. బోగస్ కంపెనీల నుంచి కొంటున్న బిల్స్ని 15 నుండి 18 శాతానికి వ్యాపారవేత్తలు అమ్ముతున్నారు. బిల్స్ లేకుంటే కంపెనీలు స్టాక్ రిజెక్ట్ చేస్తుండటంతో జీఎస్టీ మాఫియా.. బోగస్ కంపెనీలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి. బోగస్ కంపెనీలపై దాడులకు జీఎస్టీ అధికారులు సిద్దమవుతున్నారు.
చదవండి: జీఎస్టీ అధికారి కిడ్నాప్‌ కేసులో గుంటూరు టీడీపీ నేతలు

కాగా, జీఎస్టీ సీనియర్‌ అధికా­రి­ని కిడ్నాప్‌ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేత­లు, కుటుంబ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు నగర టీడీపీ నేత సయ్య­ద్‌ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్‌ ఫిరో­జ్, సయ్యద్‌ ఇంతియాజ్‌లకు హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పరిధిలోని క్రాంతినగర్‌ రోడ్‌ నంబర్‌ 2­లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజె­న్స్‌ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణా­న్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీ­బ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్‌ షేక్‌ ముషీర్‌ దాడిచేశారు. గుంటూ­రు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నా­ప్‌ చేశా­రు. అధికారుల డ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన న­లు­­గురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు.

ముజీబ్‌ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఆ పా­ర్టీ కార్యక్రమాల్లో చురు­గ్గా పాల్గొంటున్నారు. లోకేశ్‌ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరా­బాద్‌లో కిడ్నాప్‌ వ్యవహారంలో గుంటూ­రు టీడీపీ నేతలు అరెస్ట్‌ కావడం చర్చనీయాంశమైంది.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)