Breaking News

ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్‌పై ఈడ్చుకెళ్లిన భర్త

Published on Tue, 08/13/2024 - 15:54

రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్‌కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు  సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ,  మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు.  నాగౌర్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్‌ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలోషేర్‌ చేయడంతో చక్కర్లు కొడుతోంది. 

అయితే జైసల్మేర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్‌ రామ్‌ మేఘ్‌వాల్‌గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్‌వాల్‌ నిరుద్యోగి, డ్రగ్స్‌ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)