Breaking News

లక్షలు కొట్టేసి.. ఏం చేయాలో తెలియక అక్కడ పెట్టాడు.. చివరికి

Published on Mon, 11/18/2024 - 11:24

భువనేశ్వర్‌: దొంగిలించిన సొమ్మును ఏం చేయాలో తెలీక ఇంటి వెనుక గత్తం కింద దాచిపెట్టాడో ప్రబుద్ధుడు. పోలీసులు గుట్టు రట్టు చేయడంతో పరారైపోయాడు. హైదరాబాద్‌ వ్యవసాయ పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది సొమ్మును దొంగిలించి దాచాడు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం రాష్ట్రానికి విచ్చేసి ఈ దోపిడీ గుట్టు రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బాలాసోర్‌ జిల్లా బొడొమొందారుణి గ్రామానికి చెందిన గోపాల్‌ బెహరా అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి రూ. 21 లక్షలు దోచుకున్నాడు. దోచుకున్న నగదుని బావమరిది ద్వారా స్వస్థలానికి సురక్షితంగా తరలించాడు. నిందితుని అత్తమామలు ఈ సొమ్ముని సంచిలో పదిల పరచి ఇంటి పెరట గత్తం కుప్ప కింద దాచి పెట్టారు.

గోపాల్‌ బెహరా గత పదేళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ అనుభవంతో లాకరు రహస్య నంబరు వగైరా అనుబంధ సమాచారం గుట్టుగా తెలుసుకుని భారీ మొత్తాన్ని కాజేశాడు. కాజేసిన సొమ్ముని బావమరిది ద్వారా జలేశ్వర్‌లో అత్త వారింటికి తరలించాడు. కంపెనీలో నగదు గల్లంతు విషయమై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌ దర్యాప్తు బృందం రాష్ట్రానికి చేరింది. స్థానిక కొమొర్దా ఠాణా పోలీసుల సహకారంతో నిందితుని అత్త వారింటికి చేరి గాలింపు, తనిఖీలు చేపట్టింది. దర్యాప్తులో ఇంటి పెరట్లో గత్తం కుప్ప కింద దోచుకున్న సొమ్ము పాతిపెట్టినట్లు గుర్తించారు. గత్తం కుప్ప తవ్వడంతో వాస్తవం తేలింది. మరో వైపు ప్రధాన నిందితుడు, అతని మామ ఉమాకాంత బెహరా పరారీలో ఉన్నాడు. 

అతని బావమరిది రబీంద్ర బెహరాని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుని అత్త బాసంతి బెహరాని కూడా ప్రశ్నిస్తున్నారు. గత్తం తవ్వడంతో రూ. 15 లక్షలు మాత్రమే బయటపడినట్లు దర్యాప్తు బృందం వివరించింది. ఈ నెల 11న హైదరాబాదు వ్యవసాయ కంపెనీలో రూ. 21 లక్షల చోరీకి గురైంది. దీని ఆధారంగా దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇక్కడ దొరికిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌, ఫోను సంభాషణ వివరాలు ఆధారంగా దోపిడీ నుంచి తరలింపు వరకు జరిగిన ప్రక్రియ గుట్టు రట్టుకు దర్యాప్తు బృందం వ్యూహ రచన చేసింది. కేసు విచారణ, దర్యాప్తు కొనసాగుతుంది.

ఇవీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్‌ వర్కౌట్‌

గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్‌ చెబితే ‘ఏప్రిల్‌ పూల్‌’ అనుకుంది..చివరికి!


 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)