Breaking News

పేలుడు పదార్థాన్ని నోట్లో కుక్కి  ప్రియురాల్ని చంపేశాడు

Published on Tue, 08/26/2025 - 04:33

మైసూరు: కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సుమారు 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు. మహిళ మృతదేహం బెడ్‌పై పడి ఉండగా, ఆమె ముఖం దిగువ భాగం ఛిద్రమైనట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అక్కడి ఫ్లోరంతా రక్తం ధారలుగా కనిపిస్తోంది. ఆమెను హున్సూర్‌ తాలుకా గెరసనహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. 

భెరియా గ్రామంలోని ఓ లాడ్జిలో రక్షిత విగతజీవిగా కనిపించింది. ఆ లాడ్జి గదికి ప్రియుడు సిద్ధరాజుతో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన రోజువారీ కూలీతో ఈమెకు వివాహమైంది. అయితే, రక్షిత తన బంధువైన సిద్ధరాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. లాడ్జిలో ఉండగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. 

ఆ సమయంలోనే సిద్ధరాజు తన వద్ద ఉన్న పేలుడు రసాయనాన్ని ఆమె నోట్లో కుక్కి జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చాడు. ఇలాంటి జిలెటిన్‌ స్టిక్స్‌ను క్వారీల్లో బండలను పేల్చేందుకు వాడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్‌ ఫోన్‌ పేలడంతోనే ఆమె చనిపోయిందంటూ అక్కడికి వచ్చిన వారితో సిద్ధరాజు కట్టుకథ చెప్పాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)