Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి

Published on Wed, 11/20/2024 - 09:16

కుత్బుల్లాపూర్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉషా ఫ్యాన్స్‌ కంపెనీ రిటైర్డ్‌ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్‌ కుత్బుల్లాపూర్‌ పద్మానగర్‌ ఫేజ్‌–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్‌ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్‌ మృతి చెందాడు. 

ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్‌ గిలిడ్‌ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్‌ సింగ్‌ వేడుకుంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)