Breaking News

ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

Published on Tue, 02/17/2026 - 12:21

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్‌పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదు

ఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్‌ జడ్జ్‌మెంట్‌), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్‌వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.

శ్రీధర్‌ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్’

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్‌ వెంబు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు  సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.

‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్‌ వెంబు అన్నారు.

సాంకేతికత పరిష్కరించలేని సమస్యలు

లండన్‌లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్‌ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.

ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)