Breaking News

మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Published on Sat, 05/02/2026 - 08:19

ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.

అసలేం ఏం జరుగుతోంది?

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్‌) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్‌ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.

సందేశం వస్తే ఏం చేయాలి?

మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్‌ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.

భవిష్యత్తు ప్రణాళిక

ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.

ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)