Breaking News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Published on Fri, 04/04/2025 - 15:43

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనల తర్వాత భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో అమ్మకాలను కొనసాగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం క్షీణించి 75,364.69 వద్ద స్థిరపడింది. సూచీ 76,258.12 నుంచి 75,240.55 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 345.65 పాయింట్లు లేదా 1.49 శాతం క్షీణించి 22,904.45 వద్ద స్థిరపడింది.

టాటా స్టీల్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 8.36 శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 1.59 శాతం వరకు లాభపడ్డాయి.

నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 3.56 శాతం క్షీణించడంతో స్మాల్ క్యాప్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.91 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో స్థిరపడగా, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియల్టీలు 2-6.5 శాతానికి పైగా నష్టపోయాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)