మార్కెట్‌కు ‘యూఎస్‌ సుప్రీం’ జోష్‌

Published on Tue, 02/24/2026 - 04:15

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు(టారిఫ్‌లు) చెల్లవంటూ యూఎస్‌ సుప్రీం కోర్టు ఇచి్చన తీర్పు ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 480 పాయింట్లు పెరిగి 83,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142 పాయింట్లు బలపడి 25,713 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ లాభాల ముగింపు. 

ఉదయమే సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో ముందుకు కదిలాయి. స్థిరమైన డిమాండ్, ఆర్థిక పునరుద్ధరణపై ఆశావహ అంచనాలతో ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డి్రస్కేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్‌ 671 పాయింట్లు పెరిగి 83,486 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు ఎగసి 25,771 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.

బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ 1.4%, సరీ్వసెస్‌ 0.97%, హెల్త్‌కేర్‌ 0.89%, విద్యుత్‌ 0.76%, ఆటో 0.71%, ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ 0.65%, ఎఫ్‌ఎంసీజీ 0.54%, యుటిలిటి 0.52 శాతం పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.41% లాభపడగా, మిడ్‌క్యాప్‌ సూచీ 1.56% నష్టపోయింది.  

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు డీలా
హరియాణా ప్రభుత్వానికి చెందిన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగిందంటూ వార్తలు వెలుగులోకి రావడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో 20% క్షీణించి రూ.66.85 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ తాకింది. చివరికి 16% నష్టంతో రూ.70 వద్ద స్థిరపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకును ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ నుంచి హరియాణా ప్రభుత్వం తొలగించింది. దీంతో ఏయూ బ్యాంక్‌ షేరు 5.30% పతనమై రూ.974 వద్ద స్థిరపడింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)