‘క్రాష్‌ మొదలైంది.. బంగారం, వెండి కొనుగోలుకిదే సమయం’

Published on Sun, 11/23/2025 - 12:46

పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki)  నమ్ముతున్నారు.

బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే.. 
తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

ఇది చదివారా? బిట్‌కాయిన్‌ క్రాష్‌: కియోసాకి షాకింగ్‌ ప్రకటన

ధనవంతులవుతారు!
"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్‌ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్‌లలో వివరిస్తానన్నారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)