Breaking News

‘బంగారం, వెండి క్రాష్‌ అంటూ భయపెడుతున్నారు’

Published on Mon, 10/27/2025 - 13:35

ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బిట్‌కాయిన్‌, బంగారం(Gold), వెండి పెట్టుబడులకు సంబంధించి తాజాగా మరో ట్వీట్‌ చేశారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చాలా మంది యూట్యూబ్‌ జాకీలు భయాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

రాబర్ట్‌ కియోసాకి తన తాజా ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో "ఫియర్ క్లిక్ బైటింగ్" గురించి విమర్శించారు. వ్యూస్‌, సబ్‌స్కైబర్లను పెంచుకోవడానికి ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు ఆర్థిక మార్కెట్ల గురించి ముఖ్యంగా బిట్ కాయిన్, బంగారం, వెండి గురించి భయంకరమైన అంచనాలను పోస్ట్ చేస్తున్నారన్నారు.

"చాలా మంది యూట్యూబ్ జాకీలు... 'ఫియర్ క్లిక్ బైట్స్' తో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.. 'బిట్ కాయిన్ క్రాష్ కాబోతోంది.. లేదా బంగారం, వెండి పతనం కానున్నాయి' వంటి అంచనాలను చెబుతున్నారు. తర్వాత 'నా వెబ్ సైట్ కు సబ్ స్క్రైబ్ చేయండి' అంటూ అడుక్కుంటున్నారు. ఎంత మోసం?" అంటూ కియోసాకి రాసుకొచ్చారు.

నిజమైన ఆస్తులను కలిగి ఉండటంపై తన నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కియోసాకి, ఆ మార్కెట్లలో భవిష్యత్తులో ఏదైనా తిరోగమనం వస్తే మరింత కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. "వాళ్లు చెబుతున్నట్లు ఒకవేళ బిట్‌కాయిన్‌, ఎథేరియం, బంగారం, వెండి వంటివి క్రాష్‌ అయితే ఆ తగ్గిన ధరలకు మరింత ఎక్కువ కొనుగోలు చేస్తాను" అన్నారు.

ఇదీ చదవండి: షేర్ల విక్రయాలు – పన్ను మినహాయింపు

"అసలు సమస్య నకిలీ డబ్బు, అసమర్థ నాయకులు.. లక్షల కోట్లలో ఉన్న జాతీయ రుణం." అని పేర్కొన్న రాబర్ట్‌ కియోసాకి యూఎస్ డాలర్ "ఫేక్‌ మనీ" అని చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి రియల్‌ మనీ అని చెప్పే బంగారం, వెండి, బిట్‌ కాయిన్‌, ఎథేరియం వంటివాటిని పోగుచేసుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)