Breaking News

ఏఐతో ఉద్యోగాలకు చెక్‌?.. ఇక వ్యవసాయమే దిక్కా?

Published on Mon, 10/26/2026 - 17:29

ఏఐ (AI) రాకతో.. టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే.. ఇంజినీర్లు గంటల తరబడి కష్టపడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ఏఐ సాయంతో కోడింగ్ చేయడం, వెబ్‌సైట్లు రూపొందించడం, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం వంటి పనులు చాలా సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో టెక్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది?, అనే ఆందోళన మొదలైంది.

తాజాగా దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు రెడిట్‌లో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తు ఎలా ఉంటుందో?
ఏఐ అభివృద్ధి వేగాన్ని అందుకోవడం చాలా కష్టంగా మారుతోందని వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని తెలిపాడు. గతంలో ఏఐ కోడింగ్ రాయగలిగినా, క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను రూపొందించడానికి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తప్పనిసరిగా అవసరమని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏఐ ఆ పనులను కూడా చేయగలుగుతోందని, కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నాడు. దీంతో భవిష్యత్తులో తమ నైపుణ్యాలకు ఎంత విలువ ఉంటుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగం కంటే వ్యవసాయం మేలు!
ఇలాంటి పరిస్థితుల్లో.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని నమ్ముకోవడం కంటే వ్యవసాయం చేయడం లేదా, సొంతంగా నా ఆహారాన్ని నేను పండించుకోవడం మంచిదేమోనని ఆ ఇంజినీర్ చెబుతున్నారు.

ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయని ఇప్పుడే చెప్పలేకపోయినా, టెక్నాలజీ వేగంగా మారుతుండటంతో ఉద్యోగులలో భయం పెరుగుతోంది. ముఖ్యంగా కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి పనులను ఏఐ సులభంగా చేయగలగడం వల్ల భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఎలాంటి అవకాశాలు ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నెటిజన్ల రియాక్షన్
ఇంజినీర్ అభిప్రాయాలపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఏఐని చూసి భయపడకుండా.. దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలని ఒకరు సూచించారు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం తాను నాలుగేళ్ల క్రితమే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం అక్కడ వందకు పైగా కోళ్లు, గొర్రెలు, తేనెటీగల పెంపకంతో పాటు పండ్ల తోటను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పాడు.

వ్యవసాయం చేయడం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే కష్టమైనప్పటికీ, అది ఎంతో సంతృప్తిని ఇస్తోందని తన అనుభవాన్ని పంచుకున్నాడు. మరికొందరు కూడా వ్యవసాయం వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు కామెంట్లు చేశారు. ఎందుకంటే ఏఐ ఎంత అభివృద్ధి చెందినా, మనుషులకు ఆహారం అవసరం ఎప్పటికీ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఇప్పుడు ఏది కొనాలి?

Videos

ఏపీలో స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

తీరంలో తీవ్ర అలజడి.. ఉప్పాడలో అల్లకల్లోలం ఇది ట్రైలర్ మాత్రమే...

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

Photos

+5

దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్...ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)