Breaking News

25 ఏకరాల భూమి కొన్న స్టార్‌ హీరో, ధర ఎంతో తెలుసా?

Published on Tue, 07/14/2026 - 12:38

సాక్షి, ముంబై: బాలీవుడ్  హీరో రణబీర్ కపూర్ పూణేలోని ముల్షీ తాలూకాలో రూ. 16.42 కోట్లతో 25.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.  1,04,000 చదరపు మీటర్లు ( సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్నిరణ్‌బీర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ   భారీ పెట్టుబడుల తరువాత తాజాగా డీల్‌  విశేషంగా నిలుస్తోంది.

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సిఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీ 2026 ఏప్రిల్ 30న నమోదైంది. ముల్షీలోని పింప్రి గ్రామంలో ఒకదానికొకటి ఆనుకుని ఉన్న నాలుగు భూభాగాలను రణబీర్ కొనుగోలు చేశారు. వీటి మొత్తం వైశాల్యం 1,04,000 చదరపు మీటర్లు (సుమారు 25.7 ఎకరాలు). అరుణ్ శ్రీరామ్ లూత్రా, నవీన్ శ్రీరామ్ లూత్రా ,మాలా ఉమేష్ మెహతా అనే వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నారు. ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్‌బీర్ ఏకంగా రూ. 82.13 లక్షలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

రణబీర్ కపూర్ ఇటీవల అయోధ్యలోని విలాసవంతమైన లేఅవుట్ 'ది సరయూ'లో రూ. 3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్‌ను 2026 మే నెలలో కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన కొద్ది నెలలకే ఈ కొత్త భారీ భూమి కొనుగోలు జరగడం విశేషం.

ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

రణబీర్‌,  అలియా నెట్‌వర్త్‌ 
పలు కథనాల ప్రకారం కపూర్‌  కుటుంబానికి చెందిన  ఈ స్టార్‌ హీరో రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 400 కోట్లు.  జీక్యూ ఇండియా (GQ India) 2024 నివేదిక ప్రకారం, రణబీర్ కపూర్‌తో పోలిస్తే ఆలియా భట్ నికర ఆస్తి విలువ ఎక్కువ. ఆమె ఆస్తి రూ. 550 కోట్లు. ఇవి కాకుండా రణబీర్ సావన్ (Saavn), బెకో (Beco) వంటి పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. డ్రోన్‌ఆచార్య అనే ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 'ఆర్క్స్' (Arks) వంటి వెంచర్లలో భాగస్వామ్యంతో పాటు, ముంబై సిటీ ఎఫ్‌సి (Mumbai City FC) ఫుట్‌బాల్ క్లబ్‌కు సహ-యజమానిగా ఉన్నారు.

ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్‌ : తమిళనాడు జంట అరెస్ట్‌

పాలి హిల్‌లోని 'కృష్ణ రాజ్ బంగ్లా' రణబీర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ముఖ్యమైనది, దీని విలువ దాదాపు రూ. 250 కోట్లుగా చెబుతారు. పూణేలోని ట్రంప్ టవర్స్‌లో కూడా ఆయనకు ఒక అపార్ట్‌మెంట్ ఉంది. ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్‌లో బెంట్లీ కాంటినెంటల్ GT V8, రేంజ్ రోవర్, మెర్సిడెస్-AMG SL 55, G63 వంటి కార్లు ఉన్నాయి.

ఇక వృత్తిపరమైన విషయానికొస్తే, రానున్న నెలల్లో రణబీర్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబర్‌లో, నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1)లో  కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి, యష్ , సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.  2027 ప్రారంభంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, విక్కీ కౌశల్  నటించిన 'లవ్ & వార్' (Love & War) అనే పీరియడ్-రొమాన్స్ చిత్రం విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ​ చిన 'యానిమల్' (2023) చిత్రంలో  రణబీర్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)