Breaking News

'క్షమించండి.. ఆమెతో వివాహేతర సంబంధం నిజమే': ఎన్విడియా సీఈఓ

Published on Mon, 11/09/2026 - 07:18

ప్రపంచ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న ఎన్విడియా సంస్థకు.. ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఈ కంపెనీ తయారుచేసే చిప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. అలాంటి దిగ్గజ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం బయటకు రావడంతో పాటు, చైనా గూఢచర్యానికి సంబంధించిన అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి.

చైనా గూఢచర్య ప్రయత్నాలు
అసలు వివాదం ఏమిటంటే.. అక్టోబర్ 29న ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, జెన్సన్ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్య ప్రయత్నాలు జరిగినట్లు అమెరికా నిఘా సంస్థలు అనుమానించాయి. ఈ వ్యవహారంలో అలియాస్‌ హువాంగ్ (హువాంగ్ లే) అనే చైనా మహిళ పేరు వినిపించింది. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ కంపెనీలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నట్లు సమాచారం.

అమెరికా నిఘా వర్గాల అనుమానం ప్రకారం, అలియాస్‌ హువాంగ్.. జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని, ఆయన ద్వారా ఎన్విడియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సంస్థ తయారుచేసే అత్యాధునిక ఏఐ చిప్స్, వాటి సాంకేతిక వివరాలు, ఇతర కీలక సమాచారం చైనాకు చేరవేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

నా భార్యకు నమ్మకద్రోహం చేశాను
ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత జెన్సన్ హువాంగ్.. తన ఉద్యోగులకు ఒక ఇమెయిల్ పంపారు. అందులో చైనీస్‌ గూఢచారిగా భావిస్తున్న అలియాస్‌ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించారు. తన భార్యకు నమ్మకద్రోహం చేశానని తెలిపారు. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని, జరిగిన తప్పుకు ఎలాంటి సాకులు చెప్పబోనని స్పష్టం చేశారు. తన కుటుంబానికి క్షమాపణలు చెబుతూ, వారి నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

ఇన్నేళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్న ఉద్యోగులు, కంపెనీ బోర్డు సభ్యులు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా దెబ్బతీశానని అంగీకరించారు. ఎన్విడియా సంస్థకు నాయకత్వం వహించడం తన జీవితంలో గొప్ప అవకాశమని, ఆ బాధ్యతకు తగినట్లుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విచారణకు సహకరిస్తాను
ఇక చైనా గూఢచర్య ఆరోపణల విషయానికి వస్తే.. ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే స్వతంత్ర విచారణ ప్రారంభించింది. ఈ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని జెన్సన్ హువాంగ్ తెలిపారు. అమెరికా జాతీయ భద్రతకు మద్దతుగా నిలుస్తానని, తన కంపెనీ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ప్రశ్నించగా, ఇది కంపెనీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమని, దీనిపై తాను వ్యాఖ్యానించలేనని సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి: పండుగ ఆఫర్స్.. కొత్త కార్ల కొనుగోలుపై అద్భుతమైన బెనిఫిట్స్!

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)