అమెరికా చిప్స్‌ దొంగలించిన చైనా!

Published on Mon, 11/23/2026 - 11:09

అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా అత్యాధునిక ఏఐ చిప్స్‌ చైనాకు చేరాయని యూఎస్‌ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ జే క్లేటన్‌ వెల్లడించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఎన్విడియా సంస్థకు చెందిన కీలక చిప్స్‌ అక్రమ తరలింపుపై అమెరికా దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.

2024 నుంచే నిఘా

ఈ వ్యవహారంలో సింగపూర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ ‘మెగాస్పీడ్‌’ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సున్నితమైన సెమీకండక్టర్‌ సాంకేతికత మళ్లింపుపై అనుమానాలతో అమెరికా వాణిజ్య శాఖ 2024లోనే ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. 2025 మేలో ఎన్విడియా విక్రయాల వివరాలను కోరగా జూన్‌లో ఎన్విడియా మెగాస్పీడ్‌ను నో సెల్‌ జాబితాలో చేర్చింది. బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ సెక్యూరిటీ(బీఐఎస్‌) సింగపూర్‌ అధికారులతో కలిసి మెగాస్పీడ్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అప్పటి సీఈఓ ఆలిస్‌ హువాంగ్‌ను విచారించింది. అనంతరం నేరపూరిత కోణంలో న్యాయశాఖ దర్యాప్తు చేపట్టింది.

జే క్లేటన్‌ కీలక వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో జే క్లేటన్‌ మాట్లాడుతూ.. ఎన్విడియా చిప్స్‌ కోసం కొందరు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇప్పటికే కొన్ని కంపెనీలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే ఆలిస్‌ హువాంగ్‌కు చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇంకా తుది నిర్ధారణకు రాలేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఇటీవల బీఐఎస్‌ కఠిన నిబంధనలు విడుదల చేసింది. విదేశీ డేటా సెంటర్లలో సర్వర్ల ద్వారా కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని అద్దెకు తీసుకుని ఆంక్షలను అధిగమించే విధానాలకు అడ్డుకట్ట వేసింది. మరోవైపు ఎన్విడియా బోర్డు సుజాన్‌ నోరా జాన్సన్‌ అధ్యక్షతన ఎగుమతి నియంత్రణల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఎవరినీ దోషులుగా పరిగణించలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: రెండో పాలసీ ఉందని జీవిత బీమా తిరస్కరణ!

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)