Breaking News

2025లో తొలిసారి  25000 పైకి నిఫ్టీ

Published on Fri, 05/16/2025 - 04:28

ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్‌ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలతో దలాల్‌ స్ట్రీట్‌ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్‌ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్‌ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.  

→ దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్‌ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.
→ స్టాక్‌ మార్కెట్‌ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.

లాభాలు ఎందుకంటే  
→ ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్‌ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్‌ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్‌ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్‌ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.  
→ ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
→ రిటైల్‌ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. 
→ వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)