Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు!
Published on Wed, 03/15/2023 - 20:52
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుతం ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. తక్కువ కాలుష్యం కారణంగా అందరూ ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సెలబ్రిటీలందరి దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: iPhone 14 Yellow: ఐఫోన్ ఎల్లో వేరియంట్‌పై భలే డిస్కౌంట్! ఎంతంటే...
క్రికెట్ ఆట పరంగానే కాకుండా బైక్‌లు, కార్లపై అభిరుచి విషయంలోనూ ధోనీ ప్రసిద్ధి చెందారు. తన గ్యారేజీలో అనేక బైక్‌లు, క్లాసిక్ ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఇతర ప్రముఖుల లాగే ధోనీ గ్యారేజీలోనూ ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉంది. ఆయన ఇటీవల కియా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ ఈవీ6లో పెట్టుబడి కూడా పెట్టారు. దేశంలో ఈవీలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ అలాంటి కార్లు కాలుష్య సమస్యకు పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Honda Shine 100cc: 100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
ఎలక్ట్రిక్ వాహనాలపై ధోనీ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో లైథోరియం అనే ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనం పరిష్కారం కాదని తాను భావిస్తున్నట్లు ధోని ఇందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది.. థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న విద్యుత్‌ను ఉపయోగించుకునే ఎలక్ట్రిక్ వాహనాలను పర్యావరణ అనుకూలం ఎలా అంటామని ప్రశ్నించారు. మరింత సుస్థిరమైన పరిష్కారాలు రావాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు..
Tags : 1