Breaking News

టార్గెట్‌ 50 

Published on Tue, 08/12/2025 - 05:11

న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి.  

కొత్త మార్కెట్లను అన్వేషించండి.. 
అధిక యూఎస్‌ టారిఫ్‌లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  
 

55 శాతం ఎగుమతులపై ప్రభావం 
అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్‌ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)