TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో
Breaking News
ఉద్యోగంపై మారుతున్న ఆలోచన.. సర్వేలో ఆసక్తికర విషయాలు!
Published on Sun, 11/29/2026 - 11:12
భారత్‌లో ఉద్యోగం ఒక్కటే కెరీర్ మార్గమనే సంప్రదాయ భావన వేగంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సొంత వ్యాపారం ప్రారంభించాలని ఆకాంక్షించే వారు భారత్‌లోనే ఉన్నారని తాజా లింక్డ్‌ఇన్ (LinkedIn) అధ్యయనం వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 85 శాతం మంది వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు రెండింతలు కావడం విశేషం.
యువత, మహిళల్లో వ్యాపారాసక్తి
దేశంలో యువతతో పాటు మహిళల్లోనూ వ్యాపారాసక్తి బలంగా కనిపిస్తోంది.
జెన్ జీ (Gen Z): 94 శాతం మందికి భవిష్యత్తులో వ్యాపారం చేయాలనే లక్ష్యం ఉంది. వీరిలో 70 శాతం మంది వచ్చే మూడేళ్లలోనే సొంత వ్యాపారం లేదా 'సైడ్ హస్టిల్' ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
మిల్లెనియల్స్: 90 శాతం మంది వ్యాపార రంగం వైపు మొగ్గు చూపుతున్నారు.
మహిళలు: వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారిలో 91 శాతం మంది మహిళలు ఉండటం విశేషం.
ఫౌండర్ హోదాలో భారీ వృద్ధి!
లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం.. 2022తో పోలిస్తే తమ ప్రొఫైల్‌లలో ఫౌండర్ అనే హోదాను చేర్చుకున్న వారి సంఖ్య 190 శాతం పెరిగింది. జెన్ జెడ్ వర్గంలో ఈ వృద్ధి ఏకంగా 383 శాతానికి చేరుకోవడం యువ పారిశ్రామికవేత్తల ఉత్సాహానికి అద్దం పడుతోంది.
బిజినెస్ స్వరూపాన్ని మారుస్తున్న ఏఐ
వ్యాపారం ప్రారంభించడానికి గతంలో అవసరమైన భారీ పెట్టుబడులు, నైపుణ్యాలు, మానవ వనరుల భారాన్ని కృత్రిమ మేధస్సు (AI) గణనీయంగా తగ్గిస్తోంది. సర్వేలో పాల్గొన్న చిన్న వ్యాపార యజమానుల్లో..
90 శాతం మందికి పైగా.. తమ వ్యాపార కార్యకలాపాల్లో AI వినియోగిస్తున్నారు.
36 శాతం మంది.. AI సాయంతో కొత్త ఉత్పత్తులు, సేవలను అందించగలుగుతున్నామని తెలిపారు.
23 శాతం మంది.. AI అందుబాటులో లేకపోతే తమ వ్యాపారానికి మరింత ఎక్కువ నిధులు అవసరమయ్యేవని పేర్కొన్నారు.
సోషల్ మీడియాతో అవకాశాల వెల్లువ
గత ఐదేళ్లతో పోలిస్తే.. ప్రస్తుతం వ్యాపారం ప్రారంభించడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని 86 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధాన కారణాలు..
➤సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను చేరుకోవడం సులభం కావడం (74%)
➤వ్యాపారానికి సంబంధించిన సమాచారం సులభంగా అందుబాటులో ఉండటం (63%)
➤ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదికల విస్తరణ
'పోర్ట్‌ఫోలియో కెరీర్' ధోరణి
ఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారానికి పరిమితం కాకుండా, బహుళ ఆదాయ మార్గాలను ఎంచుకునే పోర్ట్‌ఫోలియో కెరీర్ సంస్కృతి పెరుగుతోంది. భారత్‌లోని చిన్న వ్యాపార యజమానుల్లో 75 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను నిర్వహిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.
వ్యక్తిగత బ్రాండింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
వ్యాపార విజయంలో ఉత్పత్తి నాణ్యతతో పాటు వ్యవస్థాపకుడి వ్యక్తిగత బ్రాండ్ (Personal Brand) కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
88 శాతం మంది తమ వ్యాపార వృద్ధి కోసం వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్మించుకుంటున్నారు.
80 శాతం మంది తాము కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారాల్సి వచ్చిందని తెలిపారు.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
Tags : 1