Breaking News

జపాన్‌ను అధిగమించిన భారత్: మరో మూడేళ్ళలో..

Published on Sun, 05/25/2025 - 15:27

2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని 'నరేంద్ర మోదీ' చాన్నాళ్లకు ముందే పేర్కొన్నారు. ఈ దిశగానే కేంద్రం కూడా అడుగులు వేస్తోంది. కాగా ఇప్పుడు.. జపాన్‌ను అధిగమించి.. భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. మొత్తం భౌగోళిక, రాజకీయ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశం కంటే.. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే పెద్ద ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉన్నాయి.

మనం ఇప్పటికే వేసుకున్న ప్రణాళికలకు కట్టుబడి ముందుకు సాగితే.. మరో మూడేళ్ళలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. తయారీ రంగం అభివృద్ధి, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం వంటివి మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటివి దేశాభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ

భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వికసిత భారత్‌లో ఇది పెద్ద అడుగు. ఇలా జరిగేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ కేంద్ర మంత్రి 'జితేంద్ర సింగ్‌' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)