Breaking News

మస్క్‌కు షాక్: ట్విటర్‌ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్‌?

Published on Thu, 10/27/2022 - 14:13

న్యూఢిల్లీ: ఎట్టకేలకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ట్విటర్‌ కొనుగోలుకు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌  సిద్ధమవుతుండగా, ఉద్యోగులు ట్విటర్‌కు గుడ్‌పై చెబుతున్నారట. ముఖ్యంగా ట్విటర్‌ డీల్‌ పూర్తి అయిన తరువాత మస్క్‌ ఆధ్వర్యంలో 75 శాతం ఉద్యోగులపై వేటు తప్పదనే నివేదికల నేపథ్యంలో ఈ నెలలోనే 50 మంది ఉద్యోగులు  రిజైన్‌ చేశారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందే కొన్ని నెలలుగా  వందలాది మంది కంపెనీని విడిచిపెట్టారని డేటా విశ్లేషణ, పరిశోధనా సంస్థ Punks & Pinstripes తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం 7,500 మంది ఉద్యోగులలో, జనవరి నుండి 1,100 మందికి పైగా కంపెనీని విడిచిపెట్టారు. గత మూడు నెలలు లేదా 90 రోజులలో దాదాపు 530 మంది ఉద్యోగాలనుంచి నిష్క్రమించారని గుర్తించినట్టు తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీని వీడిన వారితో పోలిస్తే ఇది 60 శాతం  అధికమని పేర్కొంది. అందులోనూ 44 బిలియన్ డాలర్ల విలువతో  ట్విటర్‌ కొనుగోలు దాదాపు ఖరారైన తరుణంలో ఈ నెలలోనే 50 మంది ఉద్యోగులు  గుడ్‌ బై చెప్పారని నివేదించింది. 

వీరిని గూగుల్, మెటా వంటి ప్రధాన టెక్ కంపెనీలకు మారినట్లు వెల్లడించింది. లింక్డ్ఇన్ డేటా విశ్లేషణ ఆధారంగా ఎంత మంది  ఉద్యోగులు రిజైన్‌ చేస్తున్నారు...ఏయే కంపెనీల్లో చేరుతున్నారు అనేది  విశ్లేషించినట్టు తెలిపింది. వీరిలో 30 శాతం మంది ఉద్యోగులను టెక్‌దిగ్గజాలు గూగుల్ లేదా మెటాలో ఉద్యోగాలు సంపాదించగా, మరి కొందరు Pinterest, LinkedIn, TikTok, Snap వంటి కంపెనీలకు వెళ్లారు. కాగా గూగుల్‌, మెటా నియామకాలను నిలిపివేసినట్టు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజా రిపోర్టులపై ఈ టెక్ కంపెనీలు స్పందించేంతవరకు స్పష్టత రాదు. 

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)