Breaking News

బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు

Published on Thu, 04/02/2026 - 12:54

దేశంలో బంగారం, వెండిపై పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ (SEBI) తీసుకున్న కొత్త నిర్ణయాలు, పన్ను విధానాల్లో మార్పులు మీ లాభాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆ మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం.

అంతర్జాతీయ ధరలకు స్వస్తి! 
ఇప్పటి వరకు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల (ETF) ధరలను అంతర్జాతీయ ప్రమాణాల (LBMA) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి సెబీ (SEBI) కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపై వీటి ధరలు భారతీయ ఎక్స్ఛేంజీల 'దేశీయ స్పాట్ ధర' (Domestic Spot Price) ఆధారంగానే నిర్ణయిస్తారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం మన పెట్టుబడులపై తక్కువగా ఉంటుంది. పెట్టుబడిదారులు భారత మార్కెట్ వాస్తవ ధరకే లావాదేవీలు జరపవచ్చు.

గోల్డ్ బాండ్స్‌పై పన్ను పోటు
ఫిజికల్ గోల్డ్ కంటే సురక్షితమైనదిగా భావించే సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)విషయంలో ప్రభుత్వం పన్ను నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పటి వరకు సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను మినహాయింపులు ఉండటంతో వీటిని ఉత్తమ పెట్టుబడిగా భావించేవారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిపై కూడా 'మూలధన లాభాల పన్ను' వర్తిస్తుంది.

అయితే బాండ్లను జారీ చేసిన సమయంలో నేరుగా కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు ఉంచుకునే వారికి పన్ను మినహాయింపు కొనసాగుతుంది. అదే సెకండరీ మార్కెట్ (స్టాక్ మార్కెట్) ద్వారా బాండ్లను కొనుగోలు చేసిన వారు మాత్రం ఇకపై స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

డిజిటల్ గోల్డ్‌పై ప్రభుత్వ నిఘా
డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టే ప్రయోజనాలను పూర్తిగా పన్ను వలయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ పెట్టుబడులపై కూడా పారదర్శకమైన పన్ను విధానాన్ని తీసుకురావడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

Videos

అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధంలోకి దిగిన ఇండియా..!

పెద్ది రిలీజ్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్

అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం

నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..

కమ్మ రాజధాని.! బాబు సైలెంట్..

జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు

అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో

విజయ్ కింగా..? కింగ్ మేకరా..?

పేర్ని కిట్టుపై అక్రమ కేసు

Photos

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)