Breaking News

ఏఐ ఇన్సూరెన్స్ టూల్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్‌ కంపెనీ

Published on Tue, 09/02/2025 - 13:30

బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్‌, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్‌తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్‌ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్‌ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.

ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్‌ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్‌ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్‌ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.

వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్‌లు ప్రారంభ క్లెయిమ్‌ అప్లికేషన్‌ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్‌ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.

స్మార్ట్ రిస్క్ అసెస్‌మెంట్‌: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.

ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.

ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్‌ వల్ల మోసపూరిత క్లెయిమ్‌లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా  బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్‌ యోచిస్తోంది.

ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)