Breaking News

ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా?

Published on Fri, 10/16/2026 - 19:14

హైదరాబాద్‌కు చెందిన రమ్య తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి.. తమ కుటుంబానికి చెందిన హెచ్‌యూఎఫ్‌ ఆస్తిలో ఆమెకు వాటా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో రమ్య న్యాయపోరాటానికి సిద్ధమైంది. తల్లిదండ్రుల మాట వినలేదన్న కారణంతో కుమార్తె ఆస్తి హక్కును తండ్రి కాలరాయవచ్చా? చట్టం ఏం చెబుతోంది? ఈ ఆసక్తికర అంశాన్ని తెలుసుకుందాం.

కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందనే కారణంతో కుమార్తెకు హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) ఆస్తిలో వాటాను నిరాకరించడానికి తండ్రికి చట్టపరమైన అధికారం లేదు. హిందూ వారసత్వ చట్టం, 1956కు 2005లో చేసిన సవరణ ప్రకారం కుమార్తెలకు పుట్టుకతోనే పిత్రార్జిత కుటుంబ ఆస్తిలో కుమారులతో సమాన హక్కులు లభిస్తాయి.

విభజన కోరవచ్చా?

హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం హిందూ ఉమ్మడి కుటుంబంలో కుమార్తెకు కూడా సమాన ఆస్తి హక్కులుంటాయి. కుమారుడితో సమానంగా ఆస్తిపై హక్కులు, బాధ్యతలు ఆమెకూ వర్తిస్తాయి. వివాహం చేసుకోవడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం వంటి వాటివల్ల ఈ హక్కు రద్దు అవ్వదు. అర్హత కలిగిన కుమార్తె తన వాటా కోసం కుటుంబ ఆస్తి విభజనను కోరవచ్చు.

కుటుంబాన్ని విడదీయాల్సిన అవసరం లేదు

ఒక సభ్యుడు తన వాటా కోరినంత మాత్రాన మొత్తం హెచ్‌యూఎఫ్‌ను తప్పనిసరిగా రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణుడు బల్వంత్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇతర సభ్యులు కుటుంబ వ్యవస్థలో కొనసాగవచ్చు. అయితే, ఆస్తి స్వరూపం, గతంలో జరిగిన చెల్లుబాటు అయ్యే విభజనలు, సంబంధిత పత్రాలను పరిశీలించి హక్కులను నిర్ధారించాలి.

పన్నుల విషయంలో జాగ్రత్త

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాక్షిక విభజనను గుర్తించకపోవడం కీలకమైన అంశం. కుమార్తెకు ఆస్తిలో వాటా కేటాయించినా హెచ్‌యూఎఫ్‌ పూర్తిగా విభజించబడినట్లు సంబంధిత ఆదాయపు పన్ను అధికారి గుర్తించే వరకు ఆస్తి ఆదాయంపై పన్ను బాధ్యతలు క్లిష్టంగా మారవచ్చు. అందువల్ల ఆస్తి విభజనకు ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.

ఇదీ చదవండి: రోజూ చూసే రూపీ సింబల్ వెనుక దాగున్న రహస్యాలు

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి