Breaking News

ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..

Published on Thu, 07/20/2023 - 08:03

ప్రపంచం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న తరుణంలో కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అరంగేట్రం చేసింది. ఇది చాలా రంగాలకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించి కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కేరళ కోజికోడ్‌కు చెందిన 'రాధాకృష్ణన్‌' అనే వ్యక్తికి గుర్తుతెలియని ఒక నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని అతని మాజీ సహోద్యోగిని పోలి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తి అనుకుని సంభాషణ కొనసాగించాడు. మాట్లాడుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్న బంధువుకు సాయం చేయాలనీ రూ. 40,000 కావాలని అభ్యర్థించాడు.

ఏఐ డీప్‌ఫేకింగ్‌..
తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని వెంటనే రాధాకృష్ణన్‌ రూ. 40,000 పంపించాడు. ఆ తరువాత కొంతసేపటికి మళ్ళీ రూ. 35000 కావాలని అడిగాడు. దీంతో సదరు వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు వెల్లడించారు.

(ఇదీ చదవండి: ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!)

మోసానికి పాల్పడిన వ్యక్తి AI డీప్‌ఫేకింగ్‌ ఉపయోగించి డబ్బు తీసుకున్నట్లు, లావాదేవీలు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడికి డబ్బు తిరిగి అప్పగించినట్లు సమాచారం. కేరళలో ఇలాంటి చీటింగ్ వెలుగులోకి రావడం కేసు ఇదే మొదటిదని భావిస్తున్నారు. కావున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)