Breaking News

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు జాక్‌పాట్!

Published on Thu, 11/05/2026 - 10:49

గురువారం ఉదయం భారత స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. మార్కెట్ ప్రారంభమైన గంటలోపే దాదాపు రూ.7 లక్షల కోట్ల సంపద పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో దూసుకెళ్లాయి.

సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్లకు పైగా లాభంతో 78,630 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 24,350 మార్కును దాటింది. ఉదయం 10:15 గంటల సమయానికి సెన్సెక్స్ 1,400 పాయింట్లు పెరిగి 78,735.79 వద్ద, నిఫ్టీ 431 పాయింట్లు లాభపడి 24,389.55 వద్ద ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి.

భారీ లాభాలకు కారణాలు
ముడి చమురు ధరలు తగ్గడం: ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణాల్లో ఒకటి ముడి చమురు ధరలు తగ్గడం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 8.7 శాతం పడిపోయి బ్యారెల్‌కు 94 డాలర్ల సమీపానికి చేరింది. అమెరికా క్రూడ్ ధర కూడా 88 డాలర్ల స్థాయికి దిగివచ్చింది.

భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. దేశానికి దిగుమతి ఖర్చు తగ్గుతుంది. రూపాయిపై ఒత్తిడి, ద్రవ్యోల్బణ భయాలు కూడా కొంత తగ్గుతాయి. కంపెనీల ఉత్పత్తి ఖర్చులు తగ్గి వాటి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతో ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు.

కొనుగోళ్లు పెంచిన విదేశీ ఇన్వెస్టర్లు: మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన భారత షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్ 28, 2025 తర్వాత ఇదే అత్యధిక రోజువారీ కొనుగోలుగా నిలిచింది.

అంతేకాకుండా.. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నవంబర్‌లో ఇప్పటివరకు రూ.17,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దాదాపు రూ.90,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన వీరు ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడం మార్కెట్‌కు బలాన్నిస్తోంది.

అమెరికా మార్కెట్ల ర్యాలీతో పెరిగిన జోష్
అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.6 శాతం, డౌ జోన్స్ దాదాపు 3 శాతం, నాస్‌డాక్ 1.4 శాతం పెరిగాయి. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ అనిశ్చితి తగ్గవచ్చనే అంచనాలు, చమురు ధరల పతనం అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి.

అమెరికాలో రాజకీయ పరిణామాలు ప్రభుత్వ ఖర్చులు, బాండ్ ఈల్డ్స్, డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గి, డాలర్ బలహీనపడితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Videos

ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...

కూటమి అరాచకాలపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్

నన్ను ఆపడానికి నువ్వు ఎవడివి? ఇచ్చిపడేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

చెరువుగా మారిన శంద్రబాబు రాజధాని!

ఎన్నికల్లో ట్రంప్ కు భారీ దెబ్బ కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు

దొంగ ఓటర్లను చితకబాదిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియోలు

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా..! అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాబుకు YS జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

అంతా రామమయం..!

మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు

Photos

+5

అందాల అనుపమ.. తాజా ఫొటోలు

+5

సింపుల్‌ లుక్స్‌లోనూ అదిపోయిన భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

రేపే ‘సీన్‌’ రిలీజ్‌.. నజ్రీయా నజీమ్‌ ఫొటోలు వైరల్‌

+5

నగలతో నిండైన అందం.. కంగనా ట్రెడిషనల్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

గోల్డెన్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)

+5

38వ బర్త్‌డే.. విరాట్‌ కోహ్లి ఫొటోలు వైరల్‌

+5

వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)

+5

మురసు తుపాను బీభత్సం...భారీ వర్షానికి నీట మునిగిన రాజమండ్రి (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

+5

టిప్ టాప్‌గా రెడీ అయిన మెగా డాటర్ నిహారిక (ఫొటోలు)