బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు

Published on Tue, 07/21/2026 - 06:14

గుంటూరు ఎడ్యుకేషన్‌: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా నేత­లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, పోలీసులు వా­రికి చుట్టాల్లా మారారని ధ్వజమెత్తారు. గుంటూరు కృష్ణబాబుకాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి మహిళను వివస్త్రను చేసిన సంఘటనలో బాధితురాలిని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఆమె నివాసానికి వెళ్లిన మహిళా నేతలు జరిగిన ఘటన గురించి బాధితురాలితో మాట్లాడి, ఆమెకు ధైర్యం చెప్పారు.

అధైర్యపడవద్దని,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తాము వచ్చా­మని, న్యాయం జరిగే వరకూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాబు పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్య­­క్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితారెడ్డి, మాజీ మంత్రి విడ­దల రజిని,  కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, విజయ­వా­డ నగర మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ గుంటూ­రు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మీడియాతో మాట్లా­డుతూ, ‘బోరు పంపు రిపేరు కోసం టీడీపీ నేత మల్లెల మూర్తి అడిగిన రూ.10 వేలు ఇవ్వనందుకు ఒక మహిళపై తన కుటుంబంతో సహా తొమ్మిది మంది దాడికి పాల్పడడం దారుణం.

మహిళా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే ఒక మహిళపై ఇంత అమానుషం చోటుచేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుచేటు.  సీసీ కెమెరాలు ఉండటం వల్లనే ఈ కేసు పెట్టారు. లేదంటే  కేసే ఉండేదికాదు. రాష్ట్రంలో ప్రతి­రోజూ మహిళలపై అకృ­త్యాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యా­­ంగం అన్నా, చట్టం అన్నా ఎటువంటి భయం లేకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అచ్చోసిన అంబోతుల్లా రెచ్చిపోతున్నారు. గుంటూరు ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  తప్పులు చేస్తున్న వారిని రక్షించుకుంటూపోతే 2029లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తాం’ అని హెచ్చరించారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభు­త్వం అధికా­రంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యా­చా­­రాలు పెరిగిపోయా­యని.. వాటిని నిర­సి­స్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ­న­లకు దిగనున్నట్లు ఎమ్మెల్సీ, వైఎస్సార్‌­సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి చెప్పారు. బాధి­తులకు న్యా­యం చేయాలని, నిందితు­లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వ­ర్యంలో మంగళవారం ఉదయం 10 గంట­లకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిర­సన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలి­పారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ కార్యక్ర­మాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)