చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కోసం బిల్లు!

Published on Sat, 09/27/2025 - 13:57

సాక్షి, అమరావతి: ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని ప్రభుత్వమే అంటోంది.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’’ అని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం బిల్లును ప్రవేశపెట్టగా.. వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని బిల్లులో చెప్పారు. రాజకీయ ప్రేరేపిత హత్య జరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు?. అదేదో.. దేశానికి పేరు తెచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుంది. కానీ ఇదేం సంప్రదాయం?. మీ పార్టీ పరంగా ఏదైనా సహాయం చేసుకోండి. అంతేగానీ రాజకీయ ప్రేరేపిత హత్య జరిగితే ఎలా ఉద్యోగం ఇస్తారు?. ఇప్పుడు గనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఫ్యాక్షన్‌ని ప్రోత్సహించినట్టు అవుద్ది. తప్పుడు ఆలోచనను రేకెత్తించినట్టు అవుతుంది. ఈ బిల్లు ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పై డివిజన్(ఒక బిల్లును ఆమోదించాలా వద్దా అనే విషయంలో సభ్యుల ఓట్లను స్పష్టంగా లెక్కించమని కోరడం) కోరుతున్నాం’’ అని బొత్స అన్నారు. అయితే.. 

దీనికి మంత్రి పయ్యావుల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగకూడదనే ఉద్దేశంతోనే చంద్రయ్య కొడుకు వీరాంజనేయులికి ఉద్యోగం(Chandraiah Son Govt Job) ఇస్తున్నామని అన్నారు. ఇలా ఇస్తూ పోతే అరాచకాలు మరింత పెరుగుతాయని బొత్స అనడంతో.. మంత్రులు ఊగిపోయారు. నచ్చకపోతే వాకౌట్‌ చేసి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి దురుసుగా మాట్లాడారు. దీంతో బొత్స ‘‘మేం ప్రజా సమస్లపై మాట్లాడేందుకు సభకు వచ్చామంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: ఇంత జరిగినా సభాపతి స్పందించరేం?

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)