Breaking News

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి

Published on Thu, 02/05/2026 - 15:29

సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్‌పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని  భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్  విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్‌టీఆర్‌ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.

దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్‌డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని  సీఎఫ్‌టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్‌లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్‌టీఆర్‌ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. 

వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు.  ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై దాడి చేశారు.  చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. 

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది.  అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్‌ విసిరారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)