ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన

Published on Sun, 11/16/2025 - 12:34

సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్‌ తెలిపారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్‌ జగన్‌​ వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉంది. 2025-26లోనైనా  రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు?. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కానీ, అభివృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు?’ అని ప్రశ్నించారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)