Breaking News

బడ్జెట్‌లో ఏపీకి నిల్‌!

Published on Sat, 02/01/2025 - 13:35

విజయవాడ, సాక్షి:  ఎన్డీయే కూటమి సర్కార్‌లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి.  బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్‌కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్‌.. ఇప్పుడు బడ్జెట్‌లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. 

నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్‌.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు. 

టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్‌ కల్యాణ్‌లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

బిహార్‌ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)