Breaking News

తిరుపతి పోలీసుల ఓవరాక్షన్‌.. భూమన ఫ్యామిలీపై కేసులు

Published on Sat, 10/17/2026 - 12:08

సాక్షి, తిరుపతి: ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు రెచ్చిపోతుంటే.. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ నేతలను వదిలేసి.. తిరిగి వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, అలాగే భూమన తనయుడు, తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అభినయ్‌రెడ్డిపై తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.  వీళ్లిద్దరితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపైనా కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే సాకుతో ఈ కేసులు ఫైల్‌ చేయడం గమనార్హం.

కానిస్టేబుల్స్‌ ఫిర్యాదులతోనే.. 
పోలీసు సిబ్బంది ఇస్తున్న ఫిర్యాదులోతనే వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తుండడం గమనార్హం. తిరుపతిలోని సంజయ్‌ గాంధీ కాలనీ 9వ వార్డు సచివాలయం వద్ద నామినేషన్ల దాఖలు సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని హెడ్‌ కానిస్టేబుల్‌ వినోద్‌ కుమార్‌ ఫిర్యాదు చేశాడట. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 525/2026లో భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు ఇతరుల పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. బైరాగిపట్టెడ 15వ వార్డు సచివాలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైంది. విధుల్లో ఉన్న పోలీసుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు బారికేడ్లను తోసి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో భూమన  అభినయ్‌ రెడ్డిపై ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అలాగే అభినయ్‌తో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 526/2026లో కేసు నమోదైంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారట. 

టీడీపీ నేతలపై కేసులేవీ?
మరోవైపు నామినేషన్ల టైంలో దౌర్జన్యకాండకు దిగిన టీడీపీ నాయకులపై మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ సమయంలో దౌర్జన్యకాండకు దిగినట్లు కళ్ల ముందు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా కూడా తమ అభ్యర్థులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోకపోవడమేంటని భూమన ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు తిరుపతిలో రాజకీయ వివాదానికి దారితీశాయి. 

ఇదీ చదవండి: విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆమెకే అవకాశం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)