Breaking News

గవర్నర్‌ పేరుతో టీడీపీ దుష్ప్రచారం

Published on Mon, 09/11/2023 - 05:43

సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్‌.. రిమాండ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ నేతలు గవర్నర్‌ పేరుతో రకరకాల ప్రచారాలకు తెరలేపారు. గవర్నర్‌ తమకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, కలవడానికి తమ నేతలు వెళుతున్నారని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్‌ తమ పార్టీనేతలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలిపారు.

తర్వాత కొద్దిసేపటికి అపాయింట్‌మెంట్‌ మరునాటికి మారిందని టీడీపీ వర్గాలు మాట మార్చాయి. వాస్తవానికి శనివారం గవర్నర్‌ విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తున్నట్లు ప్రచారం చేశాయి. కానీ.. అది కూడా జరగలేదు. మరోవైపు ఎల్లో మీడియా ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్‌ పట్ల గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తనకు తెలియకుండా ఎలా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారానికి దిగాయి.

శనివారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని గవర్నర్‌ సీఐడీ అధికారులను కోరారని, వాళ్లు ఫైళ్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. చివరకు అవన్నీ ఎల్లో మీడియా పుకార్లేనని తేలింది. కోర్టులో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కావాలని రకరకాల ప్రచారాలకు తెరలేపి ప్రజల్లో గందరగోళం సృష్టించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)