Breaking News

అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ నేత శ్రీనివాసులు అరెస్ట్‌

Published on Mon, 09/11/2023 - 03:47

మదనపల్లె: మాజీ సీఎం చంద్రబాబు ‘యుద్ధభేరి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో మదనపల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులును శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. ముదివేడు పిచ్చలవాండ్లపల్లె ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చిన నేపథ్యంలో... ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు అంగళ్లుకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా రైతులపై ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు వారిని కొట్టాలని, చంపాలని ఆవేశంతో కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో రైతులపై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై అంగళ్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉమాపతిరెడ్డి ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 20మందికి పైగా టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో కొందరిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం దేవరింటి శ్రీనివాసులును రూరల్‌ సీఐ శివాంజనేయులు అరెస్ట్‌ చేశారు. ఆయనకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్‌ విధించారు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)