Breaking News

అన్న క్యాంటీన్‌లో అపరిశుభ్రత.. వీడియో వైరల్‌!

Published on Tue, 08/27/2024 - 08:49

పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్‌లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్‌ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. 

అన్న క్యాంటీన్‌లో పేదలు ఉదయం టిఫిన్‌ తిన్న ప్లేట్లను వాష్‌ బేసిన్‌లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో  ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్‌ బేసిన్‌లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. 

 

పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్‌ బేసిన్‌లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్‌ బేసిన్‌లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. 

లోకేష్‌ స్పందన
ఇక తణుకు అన్న క్యాంటీన్‌ వీడియో వైరల్‌ కావడంపై ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్‌ చేశారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)