Breaking News

హెరిటేజ్‌ లాభాల కోసమా!

Published on Sun, 09/22/2024 - 03:53

సాక్షి, అమరావతి: తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీపై చెలరేగిన వివాదంపై తృణమోల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే స్పందించారు. ఇది నిజమా.. లేక రాజకీయ లబ్ధి కోసం చేస్తు­న్న ఆరోపణా.. అని ‘ఎక్స్‌’లో అనుమా­నం వ్యక్తం చేశారు. ‘తిరుపతి లడ్డూల కథ వాస్త­వమా లేక చంద్రబాబు హెరిటేజ్‌ సంస్థ లాభాలను పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సహాయంతో అల్లిన కట్టుకథా? జంతువుల కొవ్వు, పంది కొవ్వుతో తిరుపతి ప్రసాద లడ్డూలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ల్యాబ్‌ రిపోర్టు చూపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆయన పార్టీ పేర్కొంది.

ఇందులో ఆసక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు, అతని భార్య నెయ్యి తయారు చేసే హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ నడుపుతున్నారు. లోక్‌సభ ఫలితాలప్పుడు బీజేపీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోణలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ షేర్లు గాలివాటంగా అమాంతం పెరిగిపోయి ఆయన కుటుంబానికి రూ.1,200 కోట్లు లాభా­లు తెచి్చపెట్టాయి.

ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఆరోపణలు రావడం.. గుజరాత్‌ నుంచి వచ్చిన ‘ప్రైవేట్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌’ ఆధారంగా నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియం­త్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచి్చకం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చంద్రబాబును ట్యాగ్‌ చేయడంతో పాటు హెరిటేజ్‌ సంస్థ ఉత్పత్తుల చిత్రాలను సైతం జత చేశారు. పోస్ట్‌ ప్రారంభంలో ‘ఇంపార్టెంట్‌’ అని మొదలుపెట్టారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)