Breaking News

వారందరి పేర్లూ డిజిటల్‌ బుక్‌లో నమోదు చేస్తాం

Published on Mon, 02/02/2026 - 05:26

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి ప్రభు­త్వం దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన పోలీసులనూ వదిలి పెట్టబోమని, అందరి పేర్లు వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌లోకి ఎక్కిస్తామని చెప్పారు. గుంటూరులోని సిద్ధార్థనగర్‌లో శనివారం టీడీపీ రౌడీమూకల దాడి­లో ధ్వంసమైన మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కాలిపోయిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, పుస్తకాలు, ఎల్రక్టానిక్‌ సామగ్రిని ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్షి్మ, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించారు.

అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబుపై పథకం ప్రకారం దాడి జరిగిందని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా వచి్చన టీడీపీ రౌడీ మూకలను పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు.

ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని దుయ్యబట్టారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ.. డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళితే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారని చెప్పారు. గతంలో స్కిల్‌ స్కామ్‌ కేసులో దోషిగా తేలిన చంద్రబాబును చట్టపరంగా అరెస్టు చేయించామని, అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే..  
జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం  
⇒ సీబీఐ సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌లో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు ఆరోపించినట్టుగా ఆవు, పంది కొవ్వు, చేపల నూనెలు కలవలేదని దేశంలోనే ప్ర­తిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టుల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. దేవు­డ్ని అ­డ్డం పెట్టుకుని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకే­శ్, ఇతర కూటమి నాయకులు చేసిన క్షుద్ర రాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. 

⇒ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉద్దేశ పూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహరచన చేసి, అమలు చేసింది. పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు ఎక్క­డా అడ్డుకోలేదు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, భూ­మన కరుణాకర్‌ రెడ్డిపై ఇదే విధంగా దాడి చేశా­రు. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త సహా పలువురు నాయకులు స్వయంగా దాడిలో పాల్గొన్నారు. 

⇒ అంబటి నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. నాడు వైఎస్‌ జగన్‌ను పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్‌ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకులు తీవ్రమైన భాషతో దూషించారు. వాటిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? వారు ఇప్ప­టికీ అలాగే దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. వాటిపై ఆధారాలతో సహా పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరిపైనా చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు.  

వారందరినీ శిక్షించి తీరుతాం 
⇒ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రంలో అశాంతిని సృష్టించడం చంద్రబాబుకు అల­వాటే. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు పట్టాభితో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పదే, పదే తీవ్రంగా తిట్టించారు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. దానిని మనసులో పెట్టుకుని అంబటి రాంబాబును చంపాలన్న కుట్రతోనే టీడీపీ గూండా­లు దాడికి తెగబడ్డారని కచి్చతంగా తెలుస్తోంది. 

⇒ టీడీపీ గూండాల దాడిపై వైఎస్సార్‌సీపీ చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తుంది. పార్లమెంటు­లో సైతం దీనిపై గళమెత్తుతాం. వీడియోలన్నీ తీ­సిపెట్టుకున్నాం. దాడి వెనుక ఉన్న వారు, దాడి­లో పాల్గొన్న వారి పేర్లూ డిజిటల్‌ డైరీలో ఎక్కిస్తాం. నిందితులను చట్టపరంగా శిక్షించి తీరుతాం.   
⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురే‹Ù, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు.      

ఎమ్మెల్యే గళ్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారు : అంబటి మౌనిక 
గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో ఇంట్లో ఉన్న మహిళలపై కూడా దాడి జరిగిందని మాజీ మంత్రి, కాపు నాయకుడు, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక స్పష్టం చేశారు. టీడీపీ గూండాల దాడిలో దెబ్బతిన్న వస్తువులను ఆదివారం ఆమె పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డికి చూపించారు. శనివారం సాయంత్రం టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇల్లు, కార్యాలయంపై దాడులకు తెగబడ్డారని చెప్పారు.

టీడీపీ నాయకులు తన తండ్రిని ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టారన్నారు. గుంటూరు వెస్ట్‌ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వెంట పెద్ద సంఖ్యలో వచి్చన మహిళలు బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గళ్లా మాధవి ఉసికొలి్పన తర్వాతే ఇంటితో పాటు కార్యాలయంపై దాడి జరిగిందని తెలిపారు. అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని తెలిసీ, టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి దిగాయన్నారు. ఆ సమయంలో తాము పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహాయ, సహకారాలతోనేక ఈ దాడులు జరిగాయన్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)