Breaking News

సవీంద్రరెడ్డిని తక్షణమే రిలీజ్‌ చేయండి: ఏపీ హైకోర్టు

Published on Wed, 09/24/2025 - 11:41

సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రరెడ్డి(కుంచాల సౌందరరెడ్డి) అక్రమ అరెస్టును ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ బుధవారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది.

సవీందర్రెడ్డి(Savindra Reddy) కేసులో తాడేపల్లి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్టు చేసిన సమయంపై రిమాండ్‌ రిపోర్టులో తప్పుడు సమాచారం పొందుపర్చారు. సాయంత్రం 7గం. సమయంలో అదుపులోకి తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. అయితే.. 

అయితే ఆయనను సాయంత్రం 4.30గంటలకే అరెస్టు చేసినట్లు సవీంద్ర రెడ్డి తరఫు లాయర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. దీంతో పోలీసులు చెబుతున్న విషయంపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు(AP High Court).. ఆ వీడియోపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయిని.. పేర్కొంటూ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఎక్కడ, ఎప్పుడు అరెస్ట్‌ చేశారో పూర్తి దర్యాఫ్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు ఈ వివరాలను తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలంటూ ఆదేశించింది.

అదే సమయంలో.. సవీంద ర్రెడ్డిని అరెస్టు చేసిన విధానంపైనా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. అరెస్ట్‌ చేయడానికి యూనిఫారమ్‌లో ఎందుకు వెళ్లలేదని ఎస్‌హెచ్‌వోను  ప్రశ్నించింది. సవీందర్రెడ్డి భార్య కంప్లైంట్ చేసినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఆ కంప్లైంట్‌ను కేవలం జీడీ ఎంట్రీ మాత్రమే చేయడం ఏంటని నిలదీసింది. ఈ క్రమంలో.. 

సవీంద ర్రెడ్డిని ఏం జరిగిందో చెప్పాలని న్యాయమూర్తులు అడిగారు. తన భార్యతో ఉండగా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారని, గంజాయి గురించి ఏమీ తెలియదని ఆ సమయంలో సవీంద్ర కన్నీరు పెట్టుకున్నారు. 

	సవీంద్రారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం

ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్‌గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్‌ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?
– తాడేపల్లి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఇదీ చదవండి: సవీంద్ర అక్రమ అరెస్ట్‌.. తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)