Breaking News

తిరుమలపై కూటమి కుట్రలు.. భగ్గుమన్న హిందూ సంఘాలు

Published on Wed, 02/12/2025 - 11:27

తిరుపతి/అమరావతి, సాక్షి: ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 

టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్‌ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.


గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి 👉🏼 ఏడుకొండల్ని రక్షించుకుందాం

కూటమి సర్కార్‌కు హిందూ సంఘాల ప్రశ్నిలివే.. 

  • సనాతన ధర్మ రక్షణ వీరుడు, సూరుడు, ధీరుడు.. పవన్‌కల్యాణ్‌ ఎక్కడ?
  • వారాహి డిక్లరేషన్‌ అంటే తిరుమల దివ్య క్షేత్రానికి గుండు కొట్టడమా? పవన్‌ కల్యాణ్‌ గారు..
  • వారాహి డిక్లరేషన్‌ అంటే.. తిరుమల ఏడు కొండలను నాశనం చేయడమా? పవన్‌ కల్యాణ్‌ గారు..
  • వారాహి డిక్లరేషన్‌ అంటే తిరుమల ఏడు కొండలలో ముంతాజ్‌ హోటల్‌ నిర్మించడమా పవన్‌ కల్యాణ్‌ గారు?
  • సీజ్‌ ద ముంతాజ్‌ హోటల్‌ ఎప్పుడు పవన్‌ కల్యాణ్‌?
  • తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులు
  • తిరుమల ప్రక్షాళన అంటే తిరుమలను అపవిత్రం చేయడమా? చంద్రబాబు నాయుడు గారు
  • తిరుమల ప్రక్షాళన అంటే.. ముంతాజ్‌ హోటల్‌ నిర్మించడమా? చంద్రబాబు నాయుడు గారు
  • శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా?
  • ఏడు కొండలను పాడు చేయడమేనా? ప్రక్షాళన అంటే.. 
	తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)